విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఉన్న క్వారీ పేటకు చెందిన అర్జున్ అనే యువకుడు బహిర్భుమికని వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. 11 కేవీ విద్యుత్ వైర్లు కిందికి ఉండటంతోనే యువకుడు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. మృతదేహంతో భాదిత కుటుంబం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు పై బైఠాయించి ధర్నాకు దిగింది. విద్యుత్ వైర్లు చేతికందే ఎత్తులో ఉన్నాయని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవటం వల్లే, ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాగా పది లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
విద్యుత్ అధికార్ల నిర్లక్ష్యానికి యవకుడు బలి - undefined
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబం యువకుని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఉన్న క్వారీపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి