ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుడి ప్రాణం తీసిన విదేశీ చాక్లెట్ - ఏపీ న్యూస్

Boy Dies While Eating Chocolate : విదేశీ పర్యటనకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చిన చాక్లెట్‌ తన కుమారుడి ప్రాణం తీస్తుందని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. తన గారాల బుజ్జాయి కోసం నాన్న తెచ్చిన చాక్లెటే అతని పాలిట ఉరితాడవుతుందని ఆ అమ్మ అంచనా వేయలేకపోయింది. పిల్లలపై ప్రేమతో తెచ్చిన ఆ చాక్లెట్​లే.. చివరికి ఆ ఇంటి చిన్నారిని బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన వరంగల్​ జిల్లాలో చోటు చేసుకుంది.

boy Chocklet tragedy
boy Chocklet tragedy

By

Published : Nov 27, 2022, 3:06 PM IST

Boy Dies While Eating Chocolate :తెలంగాణ రాష్ట్రంలో చాక్లెట్‌ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ బతుకుదెరువు కోసం వరంగల్‌ వచ్చి డాల్ఫిన్‌ గల్లీలో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. స్థానిక శారద పబ్లిక్‌ స్కూల్‌లో ముగ్గురు చిన్నారులు చదువుతున్నారు.

ఇటీవల కంగర్‌సింగ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్లే క్రమంలో విదేశాల నుంచి తండ్రి తీసుకొచ్చిన చాక్లెట్‌ను వారికి ఇచ్చారు. వీరిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లి చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది తండ్రికి సమాచారం అందించి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే సందీప్‌ మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details