తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామ సమీపంలో నాటు పడవపై అక్రమ మద్యం తరలిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.39 వేల విలువైన 397 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా.. అక్రమంగా మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ మషూద్ బాషా హెచ్చరించారు. తాజా ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.