ఆరు పునరావాస కేంద్రాల్లో 700 మంది - వరద బాధితులు
గోదావరి వరదలతో అమలాపురం డివిజన్ వ్యాప్తంగా 700 మంది ఆరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నట్లు ఆర్డీఓ వెంకటరమణ వెల్లడించారు.
ఆరు పునారావస కేంద్రాల్లో 700 మంది
గోదావరి వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ వ్యాప్తంగా ఆరు పునరావాస కేంద్రాల్లో 700 మంది వరద బాధితులు తలదాచుకుంటున్నట్లు ఆర్డీఓ వెంకటరమణ తెలిపారు. వీరికి భోజన వసతులు కల్పించామని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.