తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ముందులొలికే తన ఏడేళ్ల కుమార్తెతోపాటుగా వెంకటేశ్వర్లు నాగుల చవితి సందర్భంగా పుట్ట వద్దకు వెళ్తున్నాడు. జాతీయ రహదారి దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు చిన్నారి పాపను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం - తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు రోడ్డు ప్రమాదం వార్తలు
నాగుల చవితికి పుట్టలో పాలు పోసేందుకు వెళ్తున్న ఆ కుటుంబంలో.. మృత్యువు కారు రూపంలో వచ్చి విషాదం నింపింది. జాతీయ రహదారిపై కారు దాటుతుండగా కారు ఢీకొని ఏడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామంలో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
ఇవీ చూడండి: