ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

60 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు - 60 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

తూర్పుగోదావరి జిల్లాలో 60 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్య కేసులో నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అమలాపురం కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ హుస్సేన్ బాషా చెప్పారు.

60 years old lady rape case acused arrest
60 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

By

Published : Dec 4, 2019, 3:02 PM IST

60 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన 60 ఏళ్ల మహిళపై అత్యాచారం, హత్య కేసులో నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కేశనకుర్తి నాగబాబు వరసకు పెద్దమ్మ అయిన మహిళపై అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడినట్లు డీఎస్పీ హుస్సేన్ బాషా తెలిపారు. అనంతరం ఆమెను హత్య చేసి తప్పించుకునేందుకు ఇల్లంతా కారం చల్లినట్లు వెల్లడించారు. ఇంట్లో ఉన్న 78 వేల 900 రూపాయలు, వెండి ఉంగరాన్ని దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించారు. నిందితుణ్ని అమలాపురం కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details