తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చిలకలపాడుకు చెందిన 44 మందిని కరోనా అనుమానితులుగా భావిస్తూ.. బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించారు. రాజమహేంద్రవరంలో పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి 2 రోజుల పాటు ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులోని బంధువుల ఇంట్లో ఉన్నట్టు కాంటాక్ట్ లిస్ట్ ద్వారా గుర్తించారు. వారందరినీ ప్రత్యేక వాహనాల్లో బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించినట్లు తహసీల్దార్ వెంకటేశ్వరి తెలిపారు.
క్వారంటైన్‌కు 44 మంది తరలింపు - latest news of east godavari dst quarantine updates
తూర్పు గోదావరి జిల్లా చిలకలపాడుకు చెందిన 44 మందిని కరోనా అనుమానితులుగా భావించి బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించారు. రాజమహేంద్రవరంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి... వీరందరితో కాంటాక్ట్ అయ్యాడని ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
జిల్లాలో 44 మందిని క్వారంటైన్‌కు తరలింపు