ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.40 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ఒడిశా నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్న రూ. 40 లక్షలు విలువ చేసే గంజాయిని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.

ganja seized in east godavari
మారేడుమిల్లి పోలీసు స్టేషన్​ పరిధిలో గంజాయి పట్టివేత

By

Published : Apr 20, 2021, 4:15 PM IST

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ వద్ద రూ.40 లక్షల విలువైన రెండు వేల కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం పోలీస్​స్టేషన్ ఎదుట వాహనాలను తనిఖీ చేస్తుండగా.. కూరగాయల లోడుతో వెళ్తున్న ఐచర్ వ్యాన్​లో గంజాయిని గుర్తించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.

తనిఖీల్లో పట్టుబడిన గంజాయి వివరాలను రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు. ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా నుంచి మారేడుమిల్లి మీదుగా హైదరాబాద్​కు గంజాయిని తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ గంజాయితో పాటు వ్యాను, ఒక ద్విచక్ర వాహనం, 5 సెల్ ఫోన్లను సీజ్ చేశామని ఆయన చెప్పారు. మొత్తం ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని.. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details