ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Godavari Flow: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. 36 గ్రామాలకు నిలిచిన రాకపోకలు - గోదావరి ఉగ్రరూపం 36 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

36 villages sufferings with godavari floods
36 villages sufferings with godavari floods

By

Published : Jul 24, 2021, 7:50 AM IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేవీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గండిపోశమ్మ ఆలయం వద్ద వరద నీరు మండపం పైవరకు చేరుకుంది.

ఎగువ కాపర్ డ్యాంపైన ఉద్ధృతంగా ప్రవహిస్తూ పి. గొందూరుకు వరదనీరు చేరుకుంటోంది. పరిహారం అందకపోవడంతో పోలవరం నిర్వాసితులు గ్రామంలోనే బిక్కుబిక్కుమంటూ కుటుంబీకులతో కలిసి కాలం వెళ్లదీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details