ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రోజుల శిశువు మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన - east godavari latest news

తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు రోజుల శిశువు చనిపోవడంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. అధిక మోతాదులో ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే పసికందు ప్రాణాలు పోయాయని బంధువులు ఆరోపించారు.

3 days baby died in tuni
మూడు రోజుల శిశువు మరణం..

By

Published : Jul 14, 2021, 10:23 PM IST

తూర్పు గోదావరి జిల్లా తునిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందు చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని ఆరోపించారు. తొండంగి మండలం పైడికొండకు చెందిన గర్భిణీ మగబిడ్డకు ఆసుపత్రిలో జన్మనిచ్చింది. రెండు రోజులు ఆరోగ్యంగానే ఉన్నా.. నర్స్ శిశువుకు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది వికటించి బాలుడు రంగు మారినట్లు బంధువులు ఆరోపించారు. అధిక మోతాదులో మందు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బంధువులు తెలిపారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్స అందించారని, రికార్డులు కూడా మార్చేసారని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు చేపట్టారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details