ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో 240 కిలోల గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై 240 కిలోల గంజాయి పట్టుబడింది. నలుగురు యువకులు విశాఖ మన్యం నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : May 19, 2021, 8:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై రామవరం వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 240 కిలోల గంజాయి పట్టుబడింది. హైదరాబాద్​కు చెందిన నలుగురు యువకులు విశాఖ మన్యం నుంచి హైదరాబాద్​కు ఇన్నోవా కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని జగ్గంపేట సీఐ సురేశ్ బాబు తెలిపారు. విశాఖ మన్యంలో కిలో గంజాయి రెండు వేల రూపాయల చొప్పున కోనుగోలు చేసి..హైదరాబాద్​లో ఐదు వేల రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారని వెల్లడించారు. నలుగురు యువకుల నుంచి 4 సెల్​ఫోన్లు, 9,700 నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. యువత ఇటువంటి చర్యలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సీఐ సురేశ్ బాబు అన్నారు. తనిఖీల్లో జగ్గంపేట ఎమ్మార్వో, ఇద్దరు వీఆర్వోలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details