తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మార్కెట్‌యార్డులో 24 అత్తాలున్న అరటి గెలలను ఓ రైతు విక్రయించాడు. సాధారణంగా కర్పూర అరటి గెలలకు 13 అత్తాలుంటాయి. కాని 24 అత్తాలున్న గెలలు చూసి అక్కడి మార్కట్లో ఉన్న రైతులు ఆశ్చర్యంగా తిలకించారు.
ఔరా!... 24 అత్తాలున్న అరటి గెల - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
కర్పూర అరటి గెలలకు 13 అత్తాలుండటం పరిపాటి..అటువంటిది ఏకంగా 24 అత్తాలున్న గెలలు రావులపాలెం అరటి మార్కెట్లో యార్డులో కనిపించాయి. దీంతో వీటిని తిలకించడానికి రైతులు ఆస్తక్తి కనిపించారు.
24 అత్తాలున్న అరటి గెల
గెల 40 కిలోలు, మరోక గెల 45 కిలోలు బరువున్నాయి. వీటిని ఒక్కొక్కటి రూ. 750లకు కొనుగోళ్లు చేసినట్లు వ్యాపారి కర్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సారావంతమైన నేల కలిగి ఉండటంతో పాటు సేంద్రియ ఎరువులు వాడినప్పుడు ఇటువంటి పెద్ద గెలలు వేస్తాయని కొత్తపేట ఉద్యానాధికారి అమర్నాథ్ చెప్పారు.
ఇదీ చదవండి: