తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన వారిని జిల్లాకు తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని నగరంలోని కమర్షియల్ టాక్స్ కాలనీకి చెందిన వారు అదికారులను కోరారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కొవిడ్ కంట్రోల్ రూంను ఆశ్రయించారు. వినతిపత్రం అందించారు. ఈనెల 9న కాకినాడ నుంచి 80 రోజుల తీర్ధయాత్రలకు వెళ్లిన 21 మంది అలహాబాద్‌లోని హరి జగన్నాథ్ శాస్త్రి చౌల్ట్రీలో చిక్కుకున్నారని తెలిపారు. వెళ్లిన వారంతా వృద్ధులేనని.. అందులో ఒకరు గుండెపోటుతో మృతి చెందారని బాధిత కుంటుంబీకులు తెలిపారు. జిల్లాకు వచ్చే సౌకర్యాలు లేక అక్కడ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాశీ యాత్రలో ఆంధ్రులు... లాక్‌డౌన్‌తో అలహాబాద్‌లో అవస్థలు - boaredrs closed due to covid-19 latest updates
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన 21 మంది అలహాబాద్‌లో చిక్కుకున్నారు. తమ కుటుంబీకులను రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ... సంబంధిత కుటుంబీకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కొవిడ్ కంట్రోల్ రూమ్ అధికారులకు వినతిపత్రం అందించారు.
కాశీలో చిక్కుకున్న కాకినాడ వాసులు