తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఓ దొంగ చోరీకి పాల్పడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొండపై నిలిపి ఉన్న ఓ భక్తుడి కారు అద్దాలు ధ్వంసం చేసి...20 వేల నగదు, 3 సెల్ ఫోన్లు చోరీ చేసి దుండగుడు పరారయ్యాడు. తణుకుకు చెందిన శ్రీనివాస్ అన్నవరం వచ్చి... కారుని పార్క్ చేసుకుని దర్శనానికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి కారు ముందు, వెనుక అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. చోరీ జరిగిందని శ్రీనివాస్ తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు అద్దాలు ధ్వంసం...20 వేల నగదు, 3 సెల్ ఫోన్లు అపహరణ - తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం
ఓ భక్తుడి కారు అద్దాలను ధ్వంసం చేసి...20 వేల నగదు, 3 సెల్ ఫోన్లు దుండగుడు చోరి చేసి పరారైన ఘటన అన్నవరం దేవస్థానంలో చోటుచేసుకుంది.
![కారు అద్దాలు ధ్వంసం...20 వేల నగదు, 3 సెల్ ఫోన్లు అపహరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4523277-204-4523277-1569192857953.jpg)
కారు అద్దాలు ధ్వంసం...20 వేల నగదు, 3 సెల్ ఫోన్లు అపహరణ