రెండు నెలల తర్వాత సొంత ఊరికి మృతదేహం - east godavari crime news
గల్ఫ్ లో రెండు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందిన ఓ మహిళ మృతదేహం తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్త గ్రామం చేరుకుంది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
గల్ఫ్‌లో మృతి చెందిన మహిళ
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ 2 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం ఖతార్ దేశం వెళ్లింది. 2 నెలల క్రితం ఆమె గుండెపోటుతో అక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహం కోసం రెండు నెలలుగా కుటుంబసభ్యులు నిరీక్షించారు. చివరకు రాజోలుకు చెందిన నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రవిశంకర్ సహకారంతో ఆమె మృతదేహం శంకరగుప్తం చేరుకుంది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.