తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామం వద్ద ఏటిగట్టు ఒడ్డున 150 సంవత్సరాలుగా స్థానిక ప్రజలతో అనుబంధం పెనవేసుకున్న మర్రిచెట్టు... రెండు రోజులగా వీస్తున్న నివర్ తుపాను గాలుల కారణంగా నేలకొరిగింది. ఈ మర్రిచెట్టు... కేంద్రపాలిత ప్రాంతం యానాం నుంచి రావులపాలెంకు సమీపంలోని నేటిగట్టి మార్గంపై అడ్డంగా పడగా.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానిక యువకులతో కలిసి అగ్నిమాపక సిబ్బంది వృక్షాన్ని తొలగించే చర్యలు చేపట్టారు.
నేలకొరిగిన 150 ఏళ్ల నాటి మహావృక్షం
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులోని పిల్లంకలో 150ఏళ్ల నాటి మర్రిచెట్టు నేలకొరిగింది. కేంద్ర పాలిత యానాం నుంచి రావులపాలెంకు సమీపంలోని నేటిగట్టి మార్గంపై అడ్డంగా పడిపోగా.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
నేలకొరిగిన 150 ఏళ్ల నాటి మహావృక్షం