అమలాపురం డిపో నుంచి నడుస్తున్న 15 బస్సులు - amalapuram rtc buses latest updates
రాష్ట్రంలో గురువారం నుంచి బస్సులు నడవనున్న తరుణంలో అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి 15 బస్సులను ఆయా మార్గాల్లో నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో భౌతికదూరం పాటించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
![అమలాపురం డిపో నుంచి నడుస్తున్న 15 బస్సులు 15 RTC buses from Amalapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7277459-306-7277459-1589975705282.jpg)
అమలాపురం డిపో నుంచి 15 బస్సులు
గురువారం నుంచి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోకు చెందిన 15 బస్సులను ఒంటి గంట వరకు ఆయా మార్గాల్లో నడిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. విజయవాాడ, రాజమండ్రి, కాకినాడకు 3 బస్సుల చోప్పున, భీమవరంకు 2 బస్సులు, విశాఖపట్నంకు ఒక బస్సు, నాలుగు పల్లెవెలుగు బస్సులు ఆయా మార్గాల్లో తిప్పేందుకు ఏర్పాట్లు చేశారు. బస్సులకు వెలుపల, లోపల క్రిమి సంహారక మందును పిచికారి చేస్తున్నారు.