తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 140 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టామని.. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.
రూ. 2.80 లక్షల విలువైన 140 కిలోల గంజాయి పట్టివేత - ఏజెన్సీ ప్రాంతం తాజా వార్తలు
అక్రమంగా తరలిస్తున్న 140 కిలోల గంజాయిని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు కూడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 140 కిలోల గంజాయి