తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ మేరకు తాజాగా 1375 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 45,356కు పెరిగింది. వైరస్ బారిన పడి మరో 8 మంది మృతి చెందగా... జిల్లావ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 303కు చేరింది. కాకినాడ అర్బన్‌లో అత్యధికంగా 281 కేసులు నిర్ధరణ కాగా... రాజమహేంద్రవరం అర్బన్‌లో 244, రాజమహేంద్రవరం గ్రామీణం303, అమలాపురంలో 55 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1051 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా అప్డేట్స్: జిల్లాలో కొత్తగా 1375 కేసులు..9 మరణాలు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 1375 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 45వేల 356కు చేరింది. తాజాగా మరో 8 మంది మృతి చెందగా...జిల్లావ్యాప్తంగా ఈ సంఖ్య 303కు పెరిగింది.
corona positive cases