ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ap corona cases today: రాష్ట్రంలో కొత్తగా 13,618 కరోనా కేసులు, 9 మరణాలు - ap corona cases today

ap corona cases today
ap corona cases today

By

Published : Jan 26, 2022, 5:24 PM IST

Updated : Jan 26, 2022, 5:48 PM IST

17:19 January 26

రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,318 కరోనా యాక్టివ్‌ కేసులు

ap corona cases today: రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదేసమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 46,143 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి తాజాగా తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి మృతి చెందగా, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా నుంచి నిన్న 8,687 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 106318 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్యధికంగా విశాఖపట్నంలో 1791 కేసులు నమోదు కాగా, అనంతపురంలో 1650, గుంటూరు 1464, కర్నూలు 1409, ప్రకాశం 1295, నెల్లూరు 1409 కేసులు నమోదయ్యాయి. కరోనాతో పోరాడుతూ ఇప్పటివరకూ 14,570 మంది మృతి చెందారు.

దేశంలో కేసుల సంఖ్య ఇలా...

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,85,914 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 665 మంది మరణించారు. 2,99,073 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసులు 4 లక్షలు దాటాయి.

  • మొత్తం కేసులు:4,00,85,116
  • మొత్తం మరణాలు:4,91,127
  • యాక్టివ్ కేసులు:22,23,018
  • మొత్తం కోలుకున్నవారు:3,73,70,971

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 59,50,731 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,58,44,536కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 33,20,485 మందికి కరోనా సోకింది. 9,650 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 35,90,43,286కి చేరగా.. మరణాల సంఖ్య 56,33,406కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా4,43,072 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,611 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.3 కోట్లు దాటింది.
  • అమెరికా నుంచి భారత్​కు వెళ్లే పౌరులు పునరాలోచించుకోవాలని అమెరికా ప్రభుత్వ సూచించింది. భారత్​లో కొవిడ్-19 ఉద్ధృతి దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
  • "ఎఫ్​డీఏ ఆమోదించిన కొవిడ్​-19 వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా సోకే ప్రమాదం కొద్దిగా తగ్గుతుంది. భారత్​లో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఆ దేశానికి వెళ్లే పౌరులు మరోసారి ఆలోచించుకోవాలి." అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్​(సీడీసీ) పేర్కొంది. కరోనా వ్యాప్తి దేశాల్లో భారత్​ను లెవెల్-3 లిస్ట్​లో చేర్చింది అమెరికా. ఉగ్రావాదం కారణంగా జమ్మకశ్మీర్​లోనూ పర్యటించవద్దని అమెరికా ప్రభుత్వం సూచనలు చేసింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 5,01,635కేసులు వెలుగుచూశాయి. మరో 467 మంది చనిపోయారు.
  • ఇటలీలో 186,740 కొత్త కేసులు బయటపడగా.. 338 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1,99,126 మందికి వైరస్​ సోకగా.. 489 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 1,00,863 కరోనా కేసులు బయటపడగా.. 259 మంది బలయ్యారు.
  • జర్మనీలో 1,48,408 వేల మందికి వైరస్ సోకింది. మరో 184మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో మరో 94,326 వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 439 మంది మృతి చెందారు.
  • స్పెయిన్​లో తాజాగా 1,14,877 కేసులు బయటపడ్డాయి. మరో 382 మంది మరణించారు.

ఇదీ చదవండి :FLAG HOSTING GOVERNOR:అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన: గవర్నర్‌ బిశ్వభూషణ్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 26, 2022, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details