ఐస్క్రీం కొనుక్కోవడానికి స్నేహితులతో కలిసి వెళ్లిన బాలుడిని కారు ఢీ కొట్టిన ఘటనలో.. అక్కడికక్కడే మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లా తునిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన 12 ఏళ్ల పవన్.. తన స్నేహితులతో కలిసి ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి జాతీయ రహదారిపై దుకాణం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి బయల్దేరాడు. అటుగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టగా.. పవన్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఐస్క్రీం కోసం వెళ్లి కానిరాని లోకాలకు... - తూర్పుగోదావరిలో బాలుడిని ఢీకొన్న కారు
తూర్పు గోదావరి జిల్లాలో ఐస్క్రీం కొనుక్కోవటానికి వెళ్లిన 12 ఏళ్ల బాలుడిని కారు ఢీకొంది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
![ఐస్క్రీం కోసం వెళ్లి కానిరాని లోకాలకు... 12 years old boy was hit by car and expires on spot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6343359-947-6343359-1583687320771.jpg)
కారు ఢీకొని మృతి చెందిన బాలుడు