తూర్పుగోదావరి జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో 13 మందిని నిందితులుగా గుర్తించామని.. 12 మందిని అరెస్టు చేశామని ఎస్పీ షీమోషి బాజ్‌పాయ్ తెలిపారు. వీరిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఉద్యోగం పేరిట అనిత అనే మహిళ బాలికను ట్రాప్ చేసిందని ఎస్పీ చెప్పారు. నిందితుల్లో నలుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారన్న ఎస్పీ.. ఒకరు మైనర్ కాగా.. మరో ఇద్దరు నిందితులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని అన్నారు. కోరుకొండ స్టేషన్లో కేసు నమోదు చేయలేదనే ఆరోపణలపై విచారణ చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.
బాలికపై వేధింపులు