తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు సరుగుడు తోటల్లో కింగ్ కోబ్రా సంచరించడంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. సుమారు 12 అడుగుల పొడవున్న ఈ కోబ్రా సరుగుడు తోటలలో కనిపించింది. మనుషులను చూస్తు ఆగి ఆగి వెళ్తోందని రైతులు చెబుతున్నారు.
గ్రామానికి చెందిన బోడ్డు లోవరాజు, సూరిబాబు పొలాల్లో ఇంతకు ముందు చూశామని అంటున్నారు. అటవీ శాఖ అధికారులు పామును పట్టుకుని తమ పొలాలకి దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని వారు కోరుతున్నారు.