తూర్పుగోదావరి జిల్లాలో పాఠశాల భవనం ఊరి పేరుకు తగినట్లుగా "టీ" ఆంగ్ల అక్షరం ఆకారంలో నిర్మించారు. తుని పట్టణంలో ఉన్న ఈ చారిత్రక కట్టడం నూట పదహారు సంవత్సరాల క్రితం నిర్మించినది. 1904లో రాజా వెంకట సింహాద్రి జగపతి రాజు బహదూర్ ఈ పాఠశాల ఏర్పాటు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు ఈ పాఠశాలలోనే నాలుగో తరగతి చదివారని చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం ఈ భవనంలో జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నారు.
తునిలో నేటికీ చెక్కు చెదరని 'టీ' పాఠశాల
ఆనాటి కట్టడాల నిర్మాణ శైలి అద్భుతం. చారిత్రక భవనాల కళాత్మకత విభిన్నం. ఆధునాతన యంత్రాలు లేనప్పటికీ కళ్లుతిప్పుకోలేని విధంగా నిర్మాణాలు చేపట్టారు. అని ఏళ్లు గడచినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని ఓ పాఠశాల ఈ కోవలోకి చెందినదే.
'T' ఆకారంలో పాఠశాల