కరోనా నేపథ్యంలో.. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం వార్షిక పరీక్షలు పురస్కరించుకుని తరగతులు కొనసాగుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది ఈ కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సగానికి పడిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో మున్సిపాలిటీ కలుపుకుని ప్రభుత్వ బడులు సుమారు 200 వరకు ఉన్నాయి. వీటిలో ప్రత్యేకించి పదో తరగతి విద్యార్థులు 35 వేల మంది వరకు చదువుతున్నారు. పదో తరగతి విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నా.. విద్యార్థులు మాత్రం తక్కువ సంఖ్యలో వస్తున్నారు. వారికి ఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులు సైతం మాస్కులు ధరించి తరగతులకు హాజరవుతున్నారు.