'మంచి ఆహారపు అలవాట్లే వందేళ్ల ఆరోగ్యానికి కారణం'
'మంచి ఆహారపు అలవాట్లే వందేళ్ల ఆరోగ్యానికి కారణం' - తూర్పు గోదావరిజిల్లా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యేలూరుకు చెందిన దాడిశెట్టి సూర్యారావు అనే వృద్ధుడి పుట్టిన రోజును ఆయన కుటుంబసభ్యులు వైభవంగా నిర్వహించారు. కుమారులు, కోడళ్లు, కూతురు, అల్లుడు, మనవళ్లు, ముని మనవళ్లతో కలిసి సూర్యారావు కేక్ కట్ చేశారు. తనకు జీవితంలో ఎన్నడూ అనారోగ్యం చేయలేదని సూర్యారావు చెప్పారు. ప్రశాంతంగా ఉండటం, నిరంతరం పనిచేయడం, మంచి ఆహారపు అలవాట్లు తన ఆరోగ్యానికి కారణమని వివరించారు.
!['మంచి ఆహారపు అలవాట్లే వందేళ్ల ఆరోగ్యానికి కారణం' 100-year-old man celebrated his birthday with family members](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6071187-128-6071187-1581678018919.jpg)
100-year-old man celebrated his birthday with family members