ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లాలో పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

By

Published : Apr 8, 2021, 7:22 AM IST

చిత్తూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

చిత్తూరు జిల్లాలో పరిషత్ ఎన్నికలకు  ఏర్పాట్లు పూర్తి
చిత్తూరు జిల్లాలో పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

చిత్తూరు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 1554 పోలింగ్ కేంద్రాల పరిధిలో 14,21,276 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 455 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 486 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.

65 మంది రిటర్నింగ్ అధికారులు, 130 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 9660 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. జిల్లాలో 65 మండలాలు ఉండగా...33 మండలాల పరిధిలోని జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 114 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 886 ఎంపీటీసీ స్థానాలకు గాను 433 స్థానాలు ఏకగ్రీవం కాగా, 34 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. 419 ఎంపీటీసీ స్థానాలకు 1040 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఇదీ చదవండి: 'వ్యాక్సినేషన్​లో ఆ రాష్ట్రాలు మెరుగుపడాలి'

ABOUT THE AUTHOR

...view details