కరోనా వైరస్ కారణంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు, జంతు ప్రదర్శనశాలలు మూతపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలు, విద్యాసంస్థలు, కళాశాలలు, థియేటర్లు, బార్లు, పార్కులు అన్నింటిని మూసివేశారు. జూపార్కు సందర్శన కోసం వచ్చామని... ముందస్తు సమాచారం ఇవ్వకుండా పార్కు మూసేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా ఎఫెక్ట్: చిత్తూరు జిల్లాలో జంతుప్రదర్శనశాల మూసివేత - చిత్తూరు జిల్లాలో జంతుప్రదర్శనశాల మూసివేత
కరోనా ప్రభావం పర్యాటక శాఖపైనా పడింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో తిరుపతి సమీపంలోని ఎస్వీ జంతు ప్రదర్శనశాలను మూసివేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

చిత్తూరు జిల్లాలో జంతుప్రదర్శనశాల మూసివేత