ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం - తిరుపతి వార్తలు

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా రెండవసారి వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. తిరుమలలోని బంగారు వాకిలి వద్ద సుబ్బారెడ్డితో తితిదే ఈవో జవహర్‌రెడ్డి.. సుబ్బారెడ్డితో ప్రమాణం చేయించారు. 2023 వరకు పదవిలో సుబ్బారెడ్జి కొనసాగనున్నారు.

yv subha reddy
తితిదే ఛైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి

By

Published : Aug 11, 2021, 12:31 PM IST

ఎన్నో అంచనాల మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా మళ్లీ వైవీ.సుబ్బారెడ్డికే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. తిరుమలలోని బంగారు వాకిలి వద్ద సుబ్బారెడ్డితో తితిదే ఈవో జవహర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. జూన్ 22తో సుబ్బారెడ్డి రెండేళ్ల ఛైర్మన్ పదవి కాలం ముగిసిపోవడంతో ఎవరిని తితిదే ఛైర్మన్​గా నియమిస్తారనే ప్రశ్న తలెత్తింది. మళ్లీ సుబ్బారెడ్డికే పట్టం కడతారనే అంచనాలను నిజం చేస్తూ నెలన్నర తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. నేడు ఆయన బాధ్యతలు స్యీకరించారు.

ABOUT THE AUTHOR

...view details