రేపు(గురువారం) సాయంత్రం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Tirumala Srivari Brahmotsavam) ప్రారంభం కానున్నాయి. గురువారం సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు(Srivari Brahmotsavam) ప్రారంభమవుతాయని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 11న ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఛైర్మన్ వెల్లడించారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం(yv subbareddy on Srivari Brahmotsavam) నిర్వహించారు.
"రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యి మందికి దర్శనం కల్పిస్తాం. రేపటి నుంచి 15వరకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ఉచిత రవాణా, దర్శన ఏర్పాట్లు చేశాం. భక్తులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ ధ్రువపత్రంతో రావాలి. కరోనా వల్ల ఏకాంతంగా బ్రహ్మోత్సవాల నిర్వహిస్తున్నాం. ఆలయ కల్యాణ మండపంలోనే వాహన సేవల నిర్వహణ. ఆగమోక్తంగా అన్ని వైదిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఈనెల 15న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈనెల 12 నుంచి చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభమవుతాయి. నెల రోజుల్లో శస్త్ర చికిత్సలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. బర్డ్ ఆసుపత్రిలో రూ.25 కోట్లతో చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధి. ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానెళ్లు సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఛానెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్ణాటక సీఎం పాల్గొంటారు’’ అని వైవీ సుబ్బారెడ్డి(yv subbareddy on Srivari Brahmotsavam) తెలిపారు.