తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ ‘వైవీ సుబ్బారెడి’ పేరుతో రూపొందిన యాప్‌ను ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. శ్రీవారి భక్తులు, ప్రజలు తనను వ్యక్తిగతంగా కలవడానికి వ్యయప్రయాసలు పడకుండా వారికి మరింత చేరువ కావడానికి ఈ యాప్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ ఐస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న వారు తిరుమల ఆలయంతోపాటు, స్థానికాలయాలకు సంబంధించి సూచనలు అందించవచ్చని, వారి ఇబ్బందులను తెలియజేయవచ్చని సూచించారు.
‘వైవీ సుబ్బారెడ్డి’ పేరుతో యాప్ - ఈటీవీ భారత్ తాజా వార్తలు
తితిదే ఛైర్మన్ ‘వైవీ సుబ్బారెడి’ పేరుతో రూపొందించిన యాప్‌ను ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. భక్తుల సౌకర్యార్థం ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు ఛైర్మన్ తెలిపారు.

‘వైవీ సుబ్బారెడ్డి’ పేరుతో యాప్