ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువగళం ఆగదు.. భయం నా బయోడేటాలోనే లేదు: లోకేశ్​

Lokesh Comments on YS Jagan : యువగళం ప్రజాబలమని, యువగళం పేరు వినగానే వైకాపా నేతల ప్యాంట్లు తడిచాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తు చేస్తూ.. మూడున్నరేళ్లుగా వైకాపా నేతలు ఏం పీకారని సూటిగా ప్రశ్నించారు.

lokesh
lokesh

By

Published : Jan 27, 2023, 5:33 PM IST

Updated : Jan 27, 2023, 7:16 PM IST

యువగళం సభలో లోకేశ్​

Lokesh Comments on YS Jagan : తన యువగళం ఓ పాదయాత్ర మాత్రమే కాదు, యువతకు పోరాడే వేదిక అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువత ను మోసం చేసిన జాదూ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. మైసూర్ బోండాలో మైసూర్ లేనట్లే జాదూ రెడ్డి జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు లేవని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం కంచుకోట కు మారుపేరు కుప్పం అని వెల్లడించారు. యువగళం ప్రజాబలమన్నారు. యువగళం పేరు వినగానే వైకాపా నేతల ప్యాంట్లు తడిచాయని ధ్వజమెత్తారు.

పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు. మూడున్నరేళ్లుగా వైకాపా నేతలు ఏం పీకారని ప్రశ్నించారు. క్యాసినో లు పెడితే పరిశ్రమలు రావని వైకాపా నేతలు గుర్తించాలని హితవు పలికారు. 3ఏళ్లలో రాష్ట్రాన్ని 67ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని దుయ్యబట్టారు. యువత, రైతులు మహిళలు ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వ బాధితులేనన్నారు.

యువగళం సభలో లోకేశ్​

జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దాం:‘‘యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తాం. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కౌలు రైతులకు ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చి ఆదుకుంటాం. ప్రభుత్వ వైఫ్యలాలను విమర్శిస్తే.. నాకు చీరలు, గాజులు పంపుతామని ఓ మహిళా మంత్రి అన్నారు. పంపించండి చీర, గాజులు.. మా అక్కలు, చెళ్లెల్లకు ఇస్తా. చీర కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతగానివాళ్లా? అని అడుగుతున్నా. మీ జగన్‌ మాదిరిగా తల్లీ, చెల్లిని బయటకు గెంటలేదు. మంత్రి పదవిలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఏ1 తెచ్చిన జీవో1తో అడ్డుకోవాలని చూస్తారా? పవన్‌ కల్యాణ్‌ పోరాటాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. పవన్‌ వారాహి వాహనానికి ఆంక్షలు పెడుతున్నారు. యువగళం ఆగదు, వారాహి ఆగదు. భయం నా బయోడేటాలోనే లేదు. అడ్డొస్తే తొక్కుకుని వెళ్లి పోతాం. మంచి కోసం పోరాడే ధైర్యం ఉంది. సైకో పాలనలో అప్పులు.. ఆత్మహత్యలు. సైకిల్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి. 400 రోజుల పాదయాత్రలో ఇది తొలిరోజు. నిరుద్యోగ యువతకు పిలుపినిస్తున్నా.. కలిసికట్టుగా ఉద్యమించి జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దాం’’ అని లోకేశ్‌ అన్నారు.

జాబ్​ క్యాలెండర్​ ఎక్కడ: ‘‘పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలోనే తెలుగు జాతి గర్వ పడేవిధంగా ఎన్టీఆర్‌కృషి చేశారు. ఆంధ్రుల సత్తా ఏంటో చంద్రబాబు చేసి చూపించారు. కానీ, ఒక్క ఛాన్స్‌ ఇస్తే జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ మూడేళ్లలో వైకాపా చేసిందేమిటి? జగన్‌రెడ్డి అంటే జాదూరెడ్డి గుర్తొస్తున్నాడు. మైసూర్‌ బోండాలో మైసూర్‌ ఉండదు.. జాదూరెడ్డి జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్నారు.. ఏమయ్యాయి ఉద్యోగాలన్నీ? ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు ఏమైంది? మెగా డీఎస్సీ ఏమైందని జాదూరెడ్డిని ప్రశ్నిస్తున్నా. దిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జాదూరెడ్డి.. దిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. దానికి కారణం నీపైన ఉన్న కేసులే. యువత, రైతులు.. ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం బాధితులే. ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 67ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా జాదూరెడ్డి? పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. జే ట్యాక్స్‌ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. మహిళలపై దాడులు జరిగితే గన్‌ కంటే ముందు జగన్‌ వస్తాడని ప్రగల్భాలు పలికారు. కానీ, అది బుల్లెట్లు లేని గన్‌ అని ప్రజలకు అర్థమైంది’’ అని లోకేశ్‌ విమర్శించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 27, 2023, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details