ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YSRCP: వైకాపా ఖాతాలో కుప్పం, నెల్లూరు... కొండపల్లిలో ఉత్కంఠ..! - చిత్తూరు జిల్లా వార్తలు

కుప్పం పురపాలక సంఘం వైకాపా కైవసమైంది. గతంలోనే ఒక స్థానం ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన 24 స్థానాల్లో.. 18 వైకాపా గెలుచుకుంది. నెల్లూరు నగర పాలికలోనూ అధికార పార్టీ సత్తా చాటింది.

YSRCP
YSRCP

By

Published : Nov 17, 2021, 3:23 PM IST

Updated : Nov 17, 2021, 4:59 PM IST

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. 'పుర పీఠాన్ని' వైకాపా సాధించింది. 25 వార్డులకు గాను ఏకగ్రీవంతో కలిపి 18 వార్డుల్లో వైకాపా గెలుపొందగా.. 6 వార్డుల్లో తెదేపా గెలుపొందింది. ఎన్నికలకు ముందే 14వ వార్డు ఏకగ్రీవమైంది. దీంతో మిగిలిన 24 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి.

వైకాపా జోరు..

నెల్లూరు నగర పాలక సంస్థలో వైకాపా సత్తా చాటింది. 54 డివిజన్లకు గానూ.. 42 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో 4 డివిజనల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ గతంలోనే 8 డివిజన్లు వైకాపాకు ఏకగ్రీమయ్యాయి.

కొండపల్లిలో హోరాహోరీ..

కృష్ణా జిల్లాలోని కొండపల్లి పురపాలిక ఎన్నిక హోరాహోరీగా సాగింది. మొత్తం 29 వార్డుల్లో వైకాపా 14, తెదేపా 14 వార్డుల్లో విజయం సాధించింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి (తెదేపా రెబల్‌‌) గెలుపొందారు. అయితే గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి శ్రీలక్ష్మి.. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఫలితంగా కొండపల్లిలో సైకిల్ పార్టీ బలం 15కి చేరింది.

ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలుపు..

రాష్ట్రంలో మొత్తం 12 పురపాలికల్లో ఓట్ల లెక్కింపు జరగగా.. అధికార వైకాపా 10 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో కుప్పం, గురజాల, ఆకివీడు, దాచేపల్లి, బుచ్చిరెడ్డిపాలెం, పెనుకొండ, రాజంపేట, కమలాపురం, బేతంచర్లఉన్నాయి. ప్రతిపక్ష తెదేపా.. ప్రకాశం జిల్లా దర్శిలో పాగా వేసింది. ఇక కృష్ణా జిల్లాలోని కొండపల్లి (29)లో చెరో 14 వార్డులను తెదేపా, వైకాపా గెలిచాయి. ఒక వార్డులో గెలిచిన తెదేపా రెబల్ అభ్యర్థి.. చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. జగ్గయ్యపేట పురపాలక సంఘం వైకాపా కైవసం చేసుకుంది. 17 చోట్ల వైకాపా, 14 చోట్ల తెదేపా గెలుపొందింది. ఈ పురపాలికలో మొత్తం వార్డులు 31 ఉన్నాయి.

డబ్బు పంపిణీతోనే కుప్పంలో వైకాపా గెలుపు: అచ్చెన్నాయుడు

ఎన్నికల్లో వైకాపా మోసం చేసి గెలిచిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కుప్పం గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, పోలీసులు, డబ్బు పంపిణీ వల్లే కుప్పంలో వైకాపా గెలిచిందని దుయ్యబట్టారు. ఈ 7 నెలల్లో తెదేపా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందన్న ఆయన... వైకాపా నేతలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విరారు. సీఎం జగన్‌ కనుసన్నల్లోనే స్థానిక ఎన్నికలు జరిగాయన్నారు.

ఇదీ చదవండి:

Bahuda Canal : బాహుదా కాలువకు వరద.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Last Updated : Nov 17, 2021, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details