ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు, తిరుపతి సెంటర్లలోనూ.. ఫ్యాన్ హవా

పుర పోరులో ఫ్యాన్ జోరు కొనసాగింది. చిత్తూరు జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో వైకాపా విజయం సాధించింది.

ysrcp wins chittoor and tirupathi muncipal corporation
ysrcp wins chittoor and tirupathi muncipal corporation

By

Published : Mar 14, 2021, 1:42 PM IST

చిత్తూరు జిల్లాలో పుర ప్రజలు వైకాపాకే పట్టం కట్టారు. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, అయిదు మున్సిపాలిటీల్లో కలిపి 131 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. కేవలం 116 స్థానాలకు 344 కేంద్రాల్లో ఈనెల 10న పోలింగ్‌ జరిగింది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో వైకాపా హవా కొనసాగింది.

తిరుపతి నగరపాలక సంస్థ వైకాపా కైవసమైంది. 49 డివిజన్లలో వైకాపా 48, తెదేపా 1 స్థానాల్లో గెలుపొందారు. అయితే గతంలో గతంలో వైకాపాకు 22 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు కార్పొరేషన్​పైనా వైకాపా జెండా ఎగరేసింది. 50 డివిజన్లలో వైకాపా 46, తెదేపా 3, స్వతంత్రులు 1 స్థానాల్లో గెలుపొందారు.

మున్సిపాలిటీల్లో పలమనేరు పురపాలక సంఘం వైకాపా సొంతమైంది. ఇక్కడ మొత్తం 26 వార్డుల్లో.. వైకాపా 24, తెదేపా 2 స్థానాల్లో గెలుపొందాయి. మిగిలన వాటి ఫలితాలు రావాల్సి ఉంది.

ఇదీ చదవండి:

ఎన్నికల ఫలితాలు: మున్సిపోల్స్​లో ఫ్యాన్ గాలి

ABOUT THE AUTHOR

...view details