అమరావతికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుంటే....మూడు రాజధానులపై తమ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసదస్సు ఏర్పాటు చేశారు. మంత్రులు నారాయణస్వామి, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లం, సీఎం రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పాలన వికేంద్రీకరణ
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పాలన వికేంద్రీకరణను చేపట్టామని, అందులో భాగంగానే గ్రామ,వార్డు సచివాలయాలు ఏర్పటయ్యాయని ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, మంత్రి కన్నబాబు తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నారాయణస్వామి.....రాయలసీమకు తాగు, సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.