తిరుపతిలో మంత్రులు నారాయణ స్వామి, పేర్ని నాని, తిరుపతి శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి ఉపఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నగరంలోని సింగాలగుంట, కనకభూషణం లేఅవుట్, చెన్నారెడ్డి కాలనీల్లో.. ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. తమ అభ్యర్థిని అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరించారు.
తిరుపతి ప్రచారంలో మంత్రులు.. ఇంటింటికీ తిరిగి ఓట్ల అభ్యర్థన - ఎన్నికల వార్తలు
తిరుపతి ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి తరఫున ప్రచారానికి మంత్రులు నేరుగా రంగంలోకి దిగారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థినే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
తిరుపతి ప్రచారంలో వైకాపా మంత్రులు.. ఇంటింటి ప్రచారం నిర్వహణ