YSRCP Leaders Occupied Building: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లెలో జడ్పీ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. పాఠశాల ఆవరణలో నిర్మించిన భవనాన్ని.. నాయకులు స్వాధీనం చేసుకుని, భవనం చుట్టూ నిర్మించిన కంచెను వైకాపా శ్రేణులు తొలగించారు. విద్యార్థులు, ఉపాధ్యాయురాలిని వైకాపా నేతలు బయటకు పంపారు.
వైకాపా నేతల దౌర్జన్యం.. పాఠశాల ఆవరణలోని భవనం స్వాధీనం! - latest news in chittoor
![వైకాపా నేతల దౌర్జన్యం.. పాఠశాల ఆవరణలోని భవనం స్వాధీనం! YSRCP Leaders occupied building](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14788535-627-14788535-1647848196191.jpg)
12:06 March 21
విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయుడు
వైకాపా నేతలు దౌర్జన్యం చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామలింగం.. విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చెల్దిగానిపల్లె సర్పంచ్ రాజేంద్రప్రసాద్, సహా మరికొందరు దౌర్జన్యం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. పాఠశాల ఆవరణలో ఇతర కార్యాలయాలు ఉండకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పు తర్వాత పంచాయతీ భవనాన్ని గతేడాది అక్టోబర్‌లో పాఠశాలకు గ్రామ కార్యదర్శి అప్పగించారు. అలాంటిది ఇప్పుడు వైకాపా నేతలు పాఠశాల ఆవరణలోని భవనాన్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి: కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కాకపోవడానికి.. కారణం ఇదే: డీఎల్