ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలపై తిరుపతిలో వైకాపా నేతల సమావేశం - పంచాయతీ ఎన్నికలకు వైకాపా సమావేశం

పంచాయతీ ఎన్నికలపై తిరుపతిలో వైకాపా నేతలు భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలను డిక్లరేషన్ ఇవ్వకుండా నిలిపి వేసిన అంశంపై చర్చించనున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.

ysrcp leaders meet in Tirupati on panchayat elections
పంచాయతీ ఎన్నికలపై తిరుపతిలో వైకాపా నేతల సమావేశం

By

Published : Feb 6, 2021, 1:54 PM IST

పంచాయతీ ఎన్నికలపై తిరుపతిలో వైకాపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. చిత్తూరు జిల్లా ఇన్​ఛార్జి మంత్రి గౌతమ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత వై.వి.సుబ్బారెడ్డి పలువురు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలను చిత్తూరు జిల్లాలో డిక్లరేషన్ ఇవ్వకుండా నిలిపి వేసిన అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు మూడు, నాలుగు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశంపై చర్చించనున్నారు.

ఇదీ చదవండి: పంచాయతీ పోరు: మూడో దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details