ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నేతలు తిరుపతిలో పాదయాత్ర నిర్వహించారు. శాసనసభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.
తిరుపతిలో వైకాపా నేతల పాదయాత్ర - bhoomana karunakar reddy news
తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన వైకాపా నేతలు, కార్యకర్తలు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపై ఉందని కరుణాకర్‌రెడ్డి అన్నారు.
![తిరుపతిలో వైకాపా నేతల పాదయాత్ర padayatra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9450180-534-9450180-1604646807181.jpg)
వైకాపా నేతల పాదయాత్ర
ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నారని కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పూర్తి బాధ్యత నాయకులపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: శానిటైజర్ గొడుగు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోజా