Kuppam : విన్నారుగా కుప్పంలో ఒక్కో ఓటుకు 5 వేలు ఖర్చు పెట్టి గెలిచారట. ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తున్న ఈయన... కుప్పం మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ దేవకి భర్త రంగయ్య.! పురపాలక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఎలా అనుమతిచ్చారన్నది కాసేపు పక్కనబెడితే భార్య తరఫున వచ్చిన రంగయ్య సమావేశంలో అసలు గుట్టువిప్పారు. మున్సిపాలిటీలో తమకు ఎలాంటి పనులు కేటాయించడం లేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. ఇటీవలే 800 రూపాయలు బిల్లు పాస్ చేశామని కమిషనర్ బదులివ్వడంతో రంగయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత చిన్న పనులా కేటాయించేదంటూ కోపగించుకున్నారు.
రంగయ్య, కుప్పం 17వ వార్డు కౌన్సిలర్ భర్త
రంగయ్య: మనం ఫస్ట్ పనిచేయాల్సింది ప్రజలకి.
రంగయ్య:నాకూ బాధ్యత ఉంది కదా.
రంగయ్య:ఈ సిటీలో పనులైనా చేయలేదని కంప్లైంట్ పోతే నేను అక్కడ ఉన్నట్టా లేనట్టా.
కమిషనర్: ఇంతకుముందు రూ.800 ఖర్చుపెట్టారు ఆరోజు నేను మీకు డబ్బులిచ్చా.
రంగయ్య: ఏదో ధర్మానికిచ్చినట్లు, నాకు ఇచ్చినట్లు మాట్లాడతారేంటి?
రంగయ్య:ఒక్క ఓటుకు రూ.5వేలు ఇచ్చినాం అక్కడ.