ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సహకార బ్యాంకు ఎదుట వైకాపా నాయకుడి ఆందోళన - చిత్తూరులో సహకార బ్యాంకు ఎదుట వైకాపా నాయకుడి ఆందోళన

చిత్తూరు జిల్లా కొటాలకు చెందిన వైకాపా నాయకుడు వెంకిటీల మురళి సహకార బ్యాంకు వద్ద ధర్నాకు దిగారు. తాను లోన్ చెల్లించినప్పటికీ బ్యాంకు వాళ్లు డాక్యుమెంట్లు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.

ysrcp leader dharna in chittore cooperative bank
సహకార బ్యాంకు ఎదుట వైకాపా నాయకుడి ఆందోళన

By

Published : Jul 18, 2020, 3:04 PM IST

చిత్తూరు సహకార కేంద్ర బ్యాంకు ఎదుట వైకాపా నాయకుడు ధర్నా చేశారు. చంద్రగిరి మండలం కొటాలకు చెందిన వెంకిటీల మురళి బ్యాంకులో క్రాప్ లోనుతో పాటు ట్రాక్టర్ కొనుగోలు కోసం లోన్ తీసుకున్నారు. ట్రాక్టర్ లోన్ బకాయిలు వన్​టైమ్​లో చెల్లించారు. ఇందుకు సంబంధించి తాము ష్యూరిటీగా పెట్టిన కాగితాలు తీసుకునేందుకు నేడు బ్యాంకుకు వచ్చారు. అయితే క్రాప్ లోను కూడా చెల్లిస్తేనే డాక్యుమెంట్లు ఇస్తామని బ్యాంకు మేనేజర్ చెప్పారు. అలా కుదరదంటూ మురళి బ్రాంచ్ మేనేజర్​పై ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాంకు నిబంధనలను వివరిస్తూ మేనేజరు ఎంత సమాధానపరిచినప్పటికీ మురళి బ్యాంకు ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా అధికార పార్టీ నాయకుడు ఇలా ధర్నా చేయడం చర్చనీయాంశమైంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details