ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గెలిపించలేదని కోపం.. రోడ్డును తవ్వేసి ప్రతాపం - యర్రంపల్లెలో రోడ్డు తొలగించిన వైకాపా అభ్యర్ధి తాజా వార్తలు

వార్డు మెంబర్‌గా తనను గెలిపించలేదన్న ఆగ్రహంతో.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం యర్రంపల్లెలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి రమేష్‌ ఆ గ్రామానికి వెళ్లే రహదారిని తవ్వేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ysrcp candidate demolish road
గెలిపించలేదని అక్కసుతో రోడ్డు తవ్వేశాడు

By

Published : Feb 19, 2021, 7:40 PM IST

గెలిపించలేదని అక్కసుతో రోడ్డు తవ్వేశాడు
వార్డు మెంబర్​గా తనను గెలిపించకపోవటంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి.. ఏకంగా తమ గ్రామానికి వెళ్లే రహదారిని తవ్విన ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం యర్రంపల్లెలో జరిగింది. బోడిగుట్ల పల్లె గ్రామ పంచాయతీలో నెర్విపల్లె, యర్రంపల్లె గ్రామాలున్నాయి. యర్రంపల్లె గ్రామ వార్డు సభ్యుడిగా రమేష్ పోటీ చేసి.. ప్రత్యర్థి చేతిలో 50 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన రమేష్ యర్రంపల్లె గ్రామానికి వెళ్లే రహదారిని తొలగించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

నలభై సంవత్సరాల క్రితం రమేష్​తో పాటు మరో ఎనిమిది మంది కలిసి గ్రామానికి రహదారి నిర్మించడానికి తమ పట్టా భూములు కేటాయించారు. ఎన్నికల్లో ఓడిపోవటంతో తన భూమిలో రహదారి వద్దంటూ రమేష్ తవ్వేశారని వాపోతున్న గ్రామస్థులు.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతోందని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details