తెదేపా అధినేత చంద్రబాబుకు కుప్పం గురించి మాట్లాడే అర్హత లేదని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. శుక్రవారం ఉదయం కుప్పంలో వైకాపా నిర్వహించిన సభలో ఆయన తమిళంలో మాట్లాడుతూ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు(ysrc mla controversial comments on chandrababu in chittoor district) చేశారు. ‘కుప్పానికి వచ్చి చెత్తకుప్పలు ఊడుస్తావా? కుప్పంలో నీకు ఇల్లు ఉందా? కుప్పం గురించి నువ్వు మాట్లాడేదేంటి? ఏదైనా ఉంటే హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడుకో’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. పత్రికల్లో రాయలేని విధంగా తెదేపా అధినేతను దూషించడంతో వైకాపా శ్రేణులే విస్తుపోయాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. వేదికపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా.. ఆయన్ను వారించే ప్రయత్నం చేయలేదు.
కుప్పం వచ్చింది చెత్తకుప్పలు ఊడ్చడానికా?: ఎమ్మెల్యే ఎంఎస్ బాబు - chandrababu news
చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ఆయనకు పనేంటంటూ దూషించారు.
ఎమ్మెల్యే ఎంఎస్ బాబు