చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రారంభించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 5 వేల 2 వందల 57 మహిళల ఖాతాల్లోకి రూ.12.19 కోట్ల నగదు జమ అవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు లాక్‌డౌన్‌ను పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు సహకరించాలని కోరారు.
'ఆర్థిక చేయూత అందించేందుకే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం' - తంబల్లపల్లెలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభమయ్యింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే ఈ పథకం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు.
తంబల్లపల్లెలో ప్రారంభమైన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం