ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర మంజూరు పత్రాలు అందజేత - ysr vehicle alliance scheme

ఆటో కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రూ.10 వేలు అందిస్తున్నట్లు మంత్రి నారాయణ స్వామి తెలిపారు. సీఎం జగన్ పదవిలో ఉన్నంతకాలం ఈ పథకాన్ని కొనసాగిస్తారని అన్నారు.

ఆటోవాలాకు మంజూరు పత్రాలు అందజేత

By

Published : Oct 7, 2019, 9:00 PM IST

ఆటోవాలాకు మంజూరు పత్రాలు అందజేత

ఆటో కార్మికులకు జగన్మోహన్​ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు అందిస్తున్నట్లు మంత్రి నారాయణస్వామి తెలిపారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన వాహన మిత్ర పథకం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో మొత్తం 547 మంది ఆటో డ్రైవర్లకు 10 వేల చొప్పున నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేశామన్నారు. జగన్ సీఎం పదవిలో ఉన్నంతకాలం ఈ పథకాన్ని కొనసాగిస్తారని... రాష్ట్రవ్యాప్తంగా లక్షమందికి పైగా ఆటోవాలాలు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం ఆటో కార్మికులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details