ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​ పాటించనివారిపై చర్యలు.. క్వారంటైన్​కు తరలింపు - చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో లాక్ డౌన్ పాటించనివారిని పోలీసులు క్యారైంటైన్ కు తరలిస్తున్నారు. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న కారణంగా.. ముందు జాగ్రత్తగా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.

chittor district
శ్రీకాళహస్తిలో లాక్ డౌన్ పాటించని యువత క్యారైన్ టైన్ కు తరలింపు

By

Published : Apr 28, 2020, 7:00 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న కారణంగా.. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో పాటు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాళహస్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలంతా ఇంటి నుంచి బయటకు రాకుండా ప్రతేక చర్యలు చేపట్టింది. నిబంధనలు అతిక్రమించిన వారిని ప్రత్యేక అంబులెన్స్ లో వికృతమాల సమీపంలోని క్యారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇది తెలుసుకున్న ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్యారంటైన్ కు వెళ్లాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details