చిత్తూరు జిల్లా సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓం ప్రతాప్... ఈనెల 24న రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిరోజుల ముందు మద్యం విధానంపై సీఎం జగన్ను ఓం ప్రతాప్ విమర్శిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా... ఇప్పుడతను ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మద్యం విధానంపై సీఎంను విమర్శించిన యువకుడి ఆత్మహత్య - హరిజనవాడలో యువకుడి ఆత్మహత్య
చిత్తూరు జిల్లా సోమల మండలం బండకాడ ఎస్సీ కాలనీలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నిరోజుల క్రితం అతను సీఎంను విమర్శిస్తూ చేసిన వీడియా వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అతను ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

మృతుడు ఓం ప్రతాప్
Last Updated : Aug 26, 2020, 1:01 PM IST