చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పాతగుంటలో గురుస్వామి(23) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లాకు చెందిన గురుస్వామి హిటాచీ యంత్రం అపరేటర్ గా పనిచేస్తున్నాడు. గురుస్వామి, అతని సహయకుడు యువరాజు ఇద్దరు కలిసి ఓ రేకుల షెడ్డులో తొమ్మిదిరోజులుగా ఉంటున్నారు. దీపావళి సందర్బంగా యంత్రానికి పూజ నిర్వహించారు. పూజ నిర్వహించిన అనంతరం యువరాజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లాడు.
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య - వెదురుకుప్పంలో ఉరివేసుకుని యువకుడు మృతి
జీవనోపాధి కోసం ఊరుకాని ఊరు వచ్చి అంతలోనే ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి ఉదంతమిది. అతడి మరణం కన్నవారిలో, ఆశ్రయం కల్పించిన వారిలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో జరిగింది.
![ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9554105-588-9554105-1605460489542.jpg)
ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
తిరిగి వచ్చిన తర్వాత యువరాజు తలుపులు ఎంత తట్టిన గురుస్వామి తీయకపోవటంతో కిటీకిలోంచి చూశాడు. ఉరివేసుకున్న గురుస్వామిని గుర్తించి ఇంటి యజమాని ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని కిందికి దించి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి
గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అభయం
TAGGED:
చిత్తూరు జిల్లా నేరవార్తలు