ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక నుంచి గుట్కా రవాణా.. యువకుడు అరెస్టు - smauggling gutka from karnataka news

కర్ణాటక నుంచి నిషేధిత గుట్కాను రవాణా చేస్తున్న వ్యక్తిని చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.

Young man arrested for smuggling Gutka
కర్ణాటక నుంచి అక్రమంగా గుట్కా రవాణా యువకుడు అరెస్టు

By

Published : Jun 11, 2020, 7:20 PM IST

చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో అక్రమంగా గుట్కా రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కందుకూరు గ్రామానికి చెందిన యువకుడు కర్ణాటక నుంచి అక్రమంగా టొబాకో గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్నాడు.

మారుగానిపల్లె చెక్ పోస్ట్ వద్ద పెద్దతిప్ప సముద్రం పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 8 వేల రూపాయలకు పైగా విలువ చేసే టొబాకో గుట్కా పాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details