చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అయితేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షునిగా దేవారెడ్డిని నియమించారు. సింగిల్ విండో కార్యాలయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కష్టపడే ప్రతీ కార్యకర్తను ఆదుకోవటంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ముందుంటారని ఛైర్మన్ తెలిపారు. తనకు అప్పగించిన పదవితో రైతులకు అండగా నిలుస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్కు మంచిపేరు తెస్తానని తెలిపారు.
ద్వితీయ శ్రేణి నేతలకు.. నామినేటెడ్ పోస్టులు - tirupati
ఎన్నికల్లో పార్టీ కోసం పోరాడిన వైకాపా ద్వితీయ శ్రేణి నేతలకు నామినేటెడ్ పోస్టులు వరంగా మారాయి.
నామినేటెడ్ పదవులు